3569) ఊహించలేదయ్య దీవిస్తావని

    

** TELUGU LYRICS **

    ఊహించలేదయ్య దీవిస్తావని 
    ఊహించనే లేదయ్య కరుణిస్తావని 
    కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును 
    నమ్మకముగా యదార్ధతతో నీ కృపలో నే సాగెదన్ 

1.  నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాధరించిన నా తండ్రివై 
    నా తోడువై నా నీడవై నా కడుపు నింపిన నా తల్లివై 
    ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
    ఆ బదులుగా ఏమివ్వగలనయ్య

2.  ఆ వేదనలో ఆ శోధనలో నా చెంత చేరిన నా దైవమై
    నీ జాడలో ఆ కల్వరిలో నా చింత తీర్చిన నా దైవమై
    ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
    ఆ బదులుగా ఏమివ్వగలనయ్య

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------