2967) లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము

** TELUGU LYRICS **

    లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి
    యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు
    రానందముతో 
    ||లేచు||

1.  యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు
    భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు
    జనులెల్లరు
    ||లేచు||

2.  కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు
    ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా
    విమల లోకమునందు
    ||లేచు||

3.  ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి
    శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్
    వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప
    ||లేచు||

4.  అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత
    రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ
    సుఖ మొందుదురు
    ||లేచు||

5.  కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు
    క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ
    డు
    ||లేచు||

6.  మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే
    మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య
    మర త్వంబిఁక నుండున్
    ||లేచు||

7.  మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా
    పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను
    జెరగపట్టెను
    ||లేచు||

8.  మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే
    మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు
    సంగీతంబులతోడ మంగళములు పాడరే
    ||లేచు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------