** TELUGU LYRICS **
లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి
లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి
కాపాడు విభుని

||లేచి||
1 .రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున
మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర
గీతము పాడుచు
||లేచి||
2. నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను
ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు
పదముల దరిఁజేర

3. నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను
దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి
మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి

4. నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ
నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము
ప్రేమనేల

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :