3504) హోసన్నా పాడుదాం యేసు దాసులరా

** TELUGU LYRICS **

హోసన్నా పాడుదాం యేసు దాసులరా
యెసయ్యా మెస్సయ్యకు ఉన్నతమందు హోసన్నా (2)

1. చిన్న గాడిద పిల్లనెక్కి కన్య సుతుడు వెళ్ళినాడు
 (2)
నన్ను తనదు వశము చేసి పన్నుగ నన్నేలును 
||హోసన్నా పాడుదాం||

2. గరులా ఆదివారమునాడు గురువు చరణములకరిగి
 (2)
పరిశుద్ద అత్మనుపొంది తిరిగి యేసుని పొగడుదాం
||హోసన్నా పాడుదాం||

3. బాలుర గీతము లాలకించి ఎలినమన యేసయ్యను
 (2)
బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం
 
||హోసన్నా పాడుదాం||

4. పాపమంతయు పోగొట్టి పాపి చెయ్యి పట్టి ఎత్తి
 (2)
వీపు మీరగ బ్రోవ నన్ను శాపపు సిలువన్ మోసెను
||హోసన్నా పాడుదాం||

5. నాడు బాలురెల్లరు కూడి పాడిరేసు స్వామికి
 (2)
నేడు యదె రీతి మనము కూడి నుతి చేయుదాం
 
||హోసన్నా పాడుదాం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------