3567) నీవేనా ఔషధం నీరక్తమే ఔషధం

    

** TELUGU LYRICS **

    ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా 
    నీవే నా దుర్గము - నీవే నా ధైర్యము   
    అప: నీవేనా ఔషధం - నీరక్తమే ఔషధం
    నీ రెక్కల చాటునా నేను దాగెదా

1.  శ్వాసే భారమై -  ఏమౌతుందోయని
    లోయలో భీతిల్లగ - మాతో ఉన్నావని
    నీ స్పర్శే చాలునయ్య
    (నన్ను) బ్రతికింప చేయునయ్యా
  
2.  బలమే క్షీణమై - నీరసమౌతుండగా
    ఈ స్థితిలో క్రీస్తుశక్తి  - పరిపూర్ణ మౌతుందని 
    నీ కృపయే చాలునయ్య 
    (నన్ను) బలమొందజేయునయా
  
3.  ఈ వ్యాధి  తీవ్రమై - ఏమౌతుందోయని - 
    నా  కాల గతులన్నియు - నీదు వశమేయని
    నీ సంకల్పము మారదు - ఇది యే నా ధైర్యము
  
4.  నీవాషించినా ఫలము - ఇంకా ఫలియించలేదని 
    ఖిన్నుడనై   చేయు ఈ  ప్రార్ధన
    దయత్తో మన్నించుమా
    ఓ అవకాశమిచ్చి పొడిగించిన
    ఈ శేషజీవితము నీ-కొరకే
    ఒక్క అవకాశమిచ్చి పొడిగించిన
    ఈ శేషజీవితము నీ-కొరకే


-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments