2046) ప్రభువా నిన్నారాధింపను జేరితిమి

** TELUGU LYRICS **

    ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా
    దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను
    విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో
    సత్యంబుతోడను 
    ||ప్రభువా||

1.  ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా
    దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి
    యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను
    భజింతుము
    ||ప్రభువా||

2.  అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో
    దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద
    లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను
    బనిచి తుదకుఁ బ్రసన్నమగుము
    ||ప్రభువా||

3.  పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో
    దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా
    దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని
    చేయ నడుపుము
    ||ప్రభువా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------