** TELUGU LYRICS **
ప్రభువా! నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొర నీ సన్నిధికి చేరనీయుమా
కారుచీకటి వేళలో నా దారి కానక పోయెనే
నమ్మిన ఆ స్నేహమే - నన్ను ఒంటరి(ని)గా చేసెనే
కాదననని ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)
స్తుతి ఆరాధనా గీతాలు
||ప్రభువా||
మరపురాని నిందలే - నా గాయములను రేపెనే
మదిలో నిండిన భయములే - నన్ను కృంగదీసెనే
నన్ను మరువలేని ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)
||ప్రభువా||
నేను చేసిన పాపమే - నాకు శాపమై మిగిలెనే
నాదు దోష కార్యములే - నన్ను నీకు దూరము చేసెనే
నన్ను మన్నించే ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)
||ప్రభువా||
------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Chitthame Chalunaya (నీ చిత్తమే చాలునయా)
------------------------------------------------------------------------------------