2010) ప్రభుని దర్శనం యేసుని దర్శన

** TELUGU LYRICS **

    ప్రభుని దర్శనం యేసుని దర్శన
    మొంది సేవ - చేయుము దేవునికి

1.  ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను
    పాప సముద్ర - పాప సముద్ర
    అగాధములో ఆత్మలు మునిగెను

2.  సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
    తన హృదయములో - తన హృదయములో
    ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను

3.  యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
    రక్షకు డేసుని - రక్షకుడేసుని
    తక్షణమే లేచి సేవించుమా

4.  ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
    విస్తారముగా - విస్తారముగా
    కోత యున్నది - నూతన బలమున రా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------