** TELUGU LYRICS **
ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా
తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి
తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి
1. లేత వయస్సు నడిప్రాయమును - గతొంచి పోవునవి
మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్
ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్
ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా
2. ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువు
గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము
అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా
అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా
గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము
అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా
అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా
3. వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాట
నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా
లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును
నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా
నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా
లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును
నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా
4. తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురా
విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి
యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి
ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా
విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి
యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి
ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా
5. నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతో
కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే
నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్
రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా
కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే
నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్
రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------