2031) ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను

** TELUGU LYRICS **

    ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను
    ఖైదీలను విడిపించెను సిలువలో

1.  ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమా
    అంతగా బాధించి సిలువమీద కెత్తిరి
    బాధనొందియు - ఎదురు మాటలాడక

2.  ముండ్ల మకుటము - తన తల నుంచిరి
    మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
    మూసియుండిన మోక్షద్వారము తెరచి

3.  ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో
    సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
    సార్వత్రికము - గడగడ వణికెను

4.  మరణించెను - సమాధి నుంచబడెను
    మూడవనాడు సమాధినుండి లేచెను
    విడిపించెను మరణ బంధితులను

5.  తీసివేసెను - నా పాప నేరమంతయు
    దేవయని ప్రభు అరచిన యపుడు
    దేవునిదయ - కుమ్మరించబడెను

6.  కారు చీకటిలో దుఃఖంబులో నేనుంటిని
    నీకువేరుగా నారక్షణిల లేదుగా
    నాదు శ్రమలు వేరెవ్వరు నెరుగరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments