1998) ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు

** TELUGU LYRICS **

1.  ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు
    దీని ప్రయాత్మ! కోరుదు రేని స్మరింపు
    కూడుడిదో! కన్నెర వీణలతో గానము చేయనులెండి

2.  సర్వము వింతగ పాలన చేసెడివాడు
    రెక్కలతో నిను మోసెను గావున బాడు
    నీకు సదా కావలి యుండుగదా - దాని గ్రహింపవదేల

3.  ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి
    సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి
    కష్టములో కప్పుచు రెక్కలతో గాచిన నాథునుతించు

4.  స్నేహపు వర్షము - నీపై తా గురియించి
    అందరు చూచుచు ఉండగానే కరుణించి
    దీవెనలు నీకు నిరంతరము నిచ్చిన నాథునుతించు

5.  నాథుని నామము - నాత్మ స్మరించి నుతింపు
    ఊపిర గల్గిన స్వరమా నీవు నుతింపు
    సంఘములో నాబ్రాహం సంతతిలో – నాథునుతింపుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------