** TELUGU LYRICS **
ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు
విభుడా మాదు స్తుతులే - నీ హారములు
విభుడా మాదు స్తుతులే - నీ హారములు
1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను
నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా
2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను
అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా
అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా
3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి
మందిరమును కట్టించు - మనిన ప్రభువా
మందిరమును కట్టించు - మనిన ప్రభువా
4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన
వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు
వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు
5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును
నిర్మించిన సంతోషింతుననిన
నిర్మించిన సంతోషింతుననిన
6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి
సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న
సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న
7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ రాకడ నాశించి
వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా
వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------