** TELUGU LYRICS **
పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా హృదయమం దిరముల వసి
యింపుమా అరుదైన నీదివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా
కరుణాబ్ధివై యిపుడు

||పరిశుద్ధాత్ముఁడ||
1. పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయాం తర దురితతూలం
బును దరికొల్పి పరిశుద్ధ పఱచి మా యాత్మల మా వరరక్షకునకు న
ర్పణ ముగా నిడుమయ్య
||పరిశుద్ధాత్ముఁడ||
2. కాంతులీనెడు దీప కలికవైవచ్చి మా స్వాంతంబులఁగప్పిన యంతు
లేని యవిద్యా ధ్వాంతంబుఁ జోపి సు స్వాంతులేగెడు సత్య సరణిఁ
జూపింపుమా

3. చలువఁ గూర్చెడు మంచు జల్లురూపమున మ మ్ముల నెల్ల దీవింపుమా
ఫలశూన్యంబైన యా ఆత్మలకు నీ బల మొసఁగి ఫలవంతములుగ
గే వలుఁడా యొనరింపుమా

4. పరమ పారావతమా! పక్షములు విప్పి మా శిరములపైని చాఁచి
పరమందు నీ సంఘ పరిశుద్ధులకువలెనె ధరనున్న మాకు నీ వరముల
నిడుమయ్య

5. దివినుండి భువికి నా రవముతో వీతెంచు పవమానాకారుండవై నవ
జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము
కృపచేఁ

6. అందమౌ నీమోము నందుఁ జిందెడు తేజ మందఱు వీక్షింపగా విందవై
వచ్చి మా డెందంబులకు నిత్యా నందంబుఁగూర్చి మా వందనంబులు
గొనుమా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :