1951) పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన

** TELUGU LYRICS **

    పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య
    వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు
    మయ్య 
    ||పరి||

1.  బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ
    గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన
    తుల్ సల్పుదు మయ్య
    ||పరి||

2.  బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము
    కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ
    బల వాక్య మిడు మాకుఁ
    ||పరి||

3.  విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము
    కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని
    యవనిం బ్రతుక నిమ్ము
    ||పరి||

4.  పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్
    త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ
    భయమొంద నీయకుము
    ||పరి||

5.  మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే
    తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము
    మము ప్రభువా
    ||పరి||

** ENGLISH LYRICS **

Parishuddhathmuda Deva! Prabhuva Nee Karuna Maa Paina Varshinchu Mayya
Varudaa Nee Bhakthula Manamula Naathmala Balaparchi Rakshinchi Mari Swasthi Nidu Mayya
||Parishuddhathmuda||

1. Balamau Nee Veluguche Balu Deva Bhashala Prajala Kandharakaikyamu Galiginchi
Vishwaasa muna Vaari Nonagoorchi Velayuchundedu Neeke Vinathul Salpudhu Mayya
||Parishuddhathmuda||

2. Balamau Dhurgamaa Migula Paavanambagu Velugaa! Prabhuvaa Devuni Gnaanamu
Galiginchi Madhithoda Biluva Thandree Yanchu Velugu Sathya Munau Nee Bala Vaakya Idu Maaku
||Parishuddhathmuda||

3. Vipareetha Bodhalanu Verau Bodhakulanu Viduva Maa Idu Saayamu
Krupa Noppu Yese Maa Guru Vanchu Madhi Nammi Yapanam mikanu Maani Yavanim Brathuka Nimmu
||Parishuddhathmuda||

4. Parishuddhathaku Noota Nera Nemmadhiki Karthaa Jarigimpa Nee Yaagnalan
Thwara Nondu Charanamulu Sthira Dendhamunu Nimmu Parishodhanalu Galuga Bhayamondha Neeyakumu
||Parishuddhathmuda||

5. Marana Jeevambu la Sthira Yodhulanu Boli Parugettha Nee Dhaarine
Thiratha Thappina Vela Dehambunaku Shakthi Garimatho Nidi Siddha Parachumu Mamu Prabhuvaa
||Parishuddhathmuda||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post