1954) పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై

** TELUGU LYRICS **

    పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ
    చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా
    టిరి నీదు సత్యంబు 
    ||పరి||

1.  బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్
    నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు
    చుందురు
    ||పరి||

2.  ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ
    పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ
    గుము
    ||పరి||

3.  పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను
    ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ
    బంపుము దేవ
    ||పరి||

4.  నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా
    యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ
    దయచేసి నీ యొద్దఁ
    ||పరి||

5.  జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను
    సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ
    మొందు నీ వాక్కు
    ||పరి||

6.  ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము
    అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన
    సంఘాధ్యక్షుండ
    ||పరి||

7.  నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు
    జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా
    ||పరి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------