1955) పరిశుద్ధాత్ముడా.. నా మంచి స్నేహితుడా

** TELUGU LYRICS **

పరిశుద్ధాత్ముడా నా మంచి స్నేహితుడా
నడిపించుము నీ త్రోవలో
కాపాడుము నీ నీడలో
యేసు పేరున జగతికి ఏతెంచితివి
సర్వ సత్యమందు మమ్ము స్థాపించితివి
నీ కృపలో నిత్యము బలపరచుమా
జ్ఞానాత్మవై మమ్ము నడిపించుమా
దీనులను ఆదరించు దైవాత్మవు
కన్నీటిని తొలగించు కనికరాత్మవు
అపవాది క్రియలను లయపరచుమా
జీవాత్మవై మమ్ము బ్రతికించుమా
పాపులను రక్షించు పవిత్రాత్మవు
పాపమును కాల్చెడి దహించు ఆత్మవు
నీ శక్తి ధైర్యము మా కొసగుమా
విజ్ఞాపన ఆత్మతో మమ్ము నింపుమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------