1919) పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో

** TELUGU LYRICS **

    పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు
    పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ 
    ||బరమ||

1.  ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట
    దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు 
    ||బరమ||

2.  శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల
    బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు 
    ||బరమ||

3.  పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర
    నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును
    ||బరమ||

4.  కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ
    మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును
    ||బరమ||

5.  పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ
    జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు
    ||బరమ||

6.  రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర
    యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును
    ||బరమ||

7.  సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర
    యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని
    ||బరమ||

8.  ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర
    ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు
    ||బరమ||

9.  ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర
    యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ
    ఫలమిడు
    ||బరమ||

** ENGLISH LYRICS **

Parama Deshamidhigo Noothana Yerooshalaemadhigo Sodhara Thiramagu
Puramadhi Dhivya Sundharamu Tharamugaadhu Thadhayu Varnimpaga
||Parama||

1. Dhwadhasha Rathnamula Prolupu Naadhulugaa Nundu Sodhara Yaadhata
Dheeraka Naani Mutthiya Vinodha Dhwaaramula Namari Velayu
||Parama||

2. Shuddha Suvarnamuna Entho Shuddhi Maargamundu Sodhara Shuddhu Lella
Bari Shuddha Gaanamula Shuddhuni Neppudu Sthuthi Yonarinthuru
||Parama||

3. Parama Janaku Samukham Bacchata Narulathoda Nundan Sodhara
Narulu Devuni Narulai Yunduru Paramaathmudu Dhana Vaaralatho Nundunu
||Parama||

4. Kanneerundadhugaa Devudu Gannula Duduchunugaa Sodhara Ennaga
Maranam Bika Nundhadhu Mari Chennuga Bhedhamu Sheegramu Tholagunu
||Parama||

5. Paramapuramunandhu Devuni Kiravokatundadhugaa Sodhara Parama
Janakudunu Gorre Pillayunu Muruvuga Noka Mandhiramai Yunduru
||Parama||

6. Ravi Chandrulathodan Nijamuga Navasaramundadhugaa Sodhara
Avirathamuga Yesuve Ghanathara Vaibhavamai Prabhatho Baraguchu Nundunu
||Parama||

7. Santhathambicchota Saadhulu Sthuthi Sethuru Devun Sodhara
Athulithambugaa Harsha Makutamunu Sathathamu Dhaalthuru Swaami Sannidhini
||Parama||

8. Aankaliyundadhugaa Nijamugaa Naakula Mundhadhugaa Sodhara
Praakatamuga Jeeva Jalambacchata Neeku Nosangunu Nirathamu Varadudu
||Parama||

9. Prabhu Sannidhinundi Paarunu Shubhanadhi Sukha Miyyan Sodhara
Ubhaya Theeramula Nundu Tharulu Sourabha Deepthini Shubha Rakshana Phalamidu
||Parama||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post