** TELUGU LYRICS **
పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్రోచి పరమ కారోహణంబైతివా
మరియయందు జననమొంది వరము లిడుచు దిరిగిధరను మరణమొంది
తిరిగిలేచి పరము కేగితివా ప్రభో

||పరమ||
1. ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ దిరుగుచుండినట్టి మమ్మును
కూరిమితోఁ దరికిఁబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి
నేరములను బాపిన ప్రభో
||పరమ||
2. సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన
ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ
ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు

3. చెఱను చెఱగఁబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా
పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ
గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా

4. నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో
మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగులఁ బ్రోదిగా గైకొనుచు
నేడు బ్రోవుమయ్య మమ్ములను

5. పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను
నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు
సేవ జేయనిలను నెల్లపుడు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :