1927) పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు

** TELUGU LYRICS **

    పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు
    నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి
    గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక
    మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి 
    ||పరలోక||

1.  యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న
    దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు
    రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ
    గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు
    ||పరలోక||

2.  ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి
    యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి
    నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి
    వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ
    ||పరలోక||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------