** TELUGU LYRICS **
పరలోకమును చూడాలిరో
పసుల పాకలో ప్రసవించేనురో!
ప్రభుయేసును చూడాలిరో
పసుల తొట్టెలో పవళించేనురో!
ఎంత అద్భుతమో అంత ఆశ్ఛర్యమురో
దేవుడే దీనుడై దిగి వచ్చేనురో!
కాలము పరిపూర్ణమాయేనురో
దేవుడు తన కుమారుని పంపేనురో
పాపము పరిపక్వమాయేనురో!
పాపముకు ప్రాయశ్ఛిత్తము చేసేనురో!
మనిషికి రక్షణను తెచ్చేనురో
లోక రక్షకుడై నిలిచేనురో
||ఎంత||
దీనులను పైకి లేవనెత్తేనురో
ప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురో!
దైవ - మానవ, సమ - సమాజమురో
దేవుని రాజ్యము స్థాపించేనురో!
పేదలు ప్రభువులు కలుసుకోవాలిరో
క్రిస్మస్ పండుగ చేసుకోవాలిరో!
||ఎంత||
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------