1820) నువ్వు లేని నన్ను ఊహించలేను

** TELUGU LYRICS **

నువ్వు లేని నన్ను ఊహించలేను
నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2)
అడగాలని నేను అనుకోకముందే
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2)
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు
యేసయ్యా నీవే నా ఆరాధ్య దైవమా
యేసయ్యా నీవే నా ఆధార దీపమా (2) 
||నువ్వు లేని||

పదివేలలో అతి సుందరుడా
కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు
ఎందుకు పనికిరాని వాడనై యుండగా
నీ కుమారునిగా నను స్వీకరించావు (2) 
||అడగాలని||

ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా
ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు
ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు
పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2)
||అడగాలని||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------