** TELUGU LYRICS **
నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా
దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల
వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు

||నిదురఁ||
1. ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని
కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును
నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు
||నిదురఁ||
2. సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ
నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను
దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన

3. మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన
నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు
గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ

4. పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు
కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల
నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున
||నిదురఁ||
5. యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి
నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని
వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :