** TELUGU LYRICS **
నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము
మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము
1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము
ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము
ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము
2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము
చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు
చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు
3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము
మంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు
మంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు
4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో
నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము
నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము
5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి
అర్హులుగ చేయు పరమునకై – ఆశించుచున్నాము
అర్హులుగ చేయు పరమునకై – ఆశించుచున్నాము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------