1561) నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో సోదారా

** TELUGU LYRICS **

    నిక్కమురా లోకము చెడ్డదిరా తక్షణమే మేలుకో సోదారా
    ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా

1.  విన్నాననుకొంటివి కాని గ్రహియింపకున్నావా ?
    చూసాననుకొంటూనే తెరువలేకున్నావా
    దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా
    త్రోవను జారా విడిచి కుడి ఎడమకు తప్పావా
    పాపేచ్చలతోటి క్రీస్తేసుని మరిచావా
    తన గాయములను రేపుటకు కారకుడైయున్నావా

2.  శోధనల పోరుటముతో సరిపెట్టకు నీ పయనం
    కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్మం
    పానార్పణనొందే గాని సుఖమెరుగకు అది శూన్యం
    ప్రేమ విశ్వాసముతోటి నడిచేదే నీ జీవితం
    నీ పరుగును కడముట్టించే నీదే మంచి పోరాటం
    పరభాగ్యము నీవు పొంద ప్రకటించుము యేసుని వాక్యం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments