1562) నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు

** TELUGU LYRICS **

    నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన
    మదిని బ విత్రమూలం బెటుల బొడమును 
    ||నిజము||

1.  దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన
    నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే
    తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు
    రస ముండునె తలంపగ
    ||నిజము||

2.  మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా
    మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము
    దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల
    మనుజుఁడె ట్లొ నరింపఁజాలును
    ||నిజము||

3.  నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ
    ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ
    డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ
    పాపులను రక్షింపవలయును
    ||నిజము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------