** TELUGU LYRICS **
నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును
గలిగి దేవుని దివ్యసేవను జేతుము
గలిగి దేవుని దివ్యసేవను జేతుము
1. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత
మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో
2. వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున
దైవ చిత్తము ననుసరించుచు నడుతుము
3. ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక
నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము
4. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి
పనులన్నిటి కృంగదీసెదమనిశము
5. ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు
స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము
6. శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో
హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము
7. చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి
వృద్ధికి మిన్నగ దోడ్పడెదము
8. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు
మనసును శ్రద్ధతోడను జూపుచు
9. జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల
రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------