1855) నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

** TELUGU LYRICS **

    నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

1.  ఆర్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా
    నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి
    అర్పింతు నీకే నా ఆరాధన

2.  ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా
    శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున
    చేర్చితివి నిన్నే ఆరాధింతు

3.  తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా
    ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ
    అర్పింతు నీకే నా ఆరాధన

4.  సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
    దృష్టించితివి నా హౄదయమున్ - దహించితివి దుష్టత్వము
    ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు

5.  అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి
    పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలొ గెలిచి
    విజయ మిచ్చినందుల కారాధింతున్

6.  నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము
    అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్
    అర్పింతు నీకే నా ఆరాధన

7.  ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా
    సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న
    ఆమేన్ అనువాడా హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------