** TELUGU LYRICS **
నేర్చుకొనరే యేసు వాడుకలను దినము మీ బ్రతుకునందున
నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో

||నేర్చుకొనరే||
1. ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు
ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక
||నేర్చుకొనరే||
2. దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ
నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు

3. పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను
ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను

4. బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము
జూపించి మేలును జేసిన విధంబు మీరలు

5. సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో
సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక

6. అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల
యక్కరలను జక్కగ దీర్చిన విధంబును

7. దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా
ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :