1847) నేను చేసిన పాపముకై నీదు ప్రాణము బలియాయెను

** TELUGU LYRICS **

నేను చేసిన పాపముకై
నీదు ప్రాణము బలియాయెను
నాపైవున్న దోషముకై నలిగి ముద్దాయేనా
యేసయ్యా నీ ప్రేమ ఎంత అమరం
నాయేసయ్యా అది విలువకట్టలేను
ఏ నేరము చేయని నిన్ను
ఏ పాపము ఎరుగని నిన్ను
దూషించిరా అపహసించిరా
నిలువెల్ల నిను గాయపరచిరా
నాచేయి చేసిన పాపానికై నీచేతిలో సీలలా
నా కాళ్ళు చేసిన దోషాలకై
నీ కాళ్ళలో మేకులా
ఏ బంధము చూపలేనిది
నాపై నీవు చూపిన ప్రేమ
నా మనస్సులో చేసిన పాపం
నీ ప్రక్కలో బల్లెమాయెనా
నా తలంపుతో చేసిన పాపముకు
నీకు ముళ్ల మకుటము
సుకుమారమైన నీ మోముపైన
నోటితో ఉమ్మిరా
నా శరీరం చేసిన పాపం
నీ దేహమునే చీల్చివేసెనా
సుందరమైన నీ రూపమే
రక్త వర్ణముగా మారిపోయేన
వేవేల దూతలతో కొనియడబడుతున్న
నిన్నే దూషించిరా
నాపైన ఎనలేని ప్రేమను చూపిన
నా దైవమా వందనం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments