1846) నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము

** TELUGU LYRICS **

    నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము

1.  ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన
    ఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య

2.  నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే
    పాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము

3.  నా యపరాధము చేతను నే జేసిన పాపమందున
    సత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా

4.  పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని
    ఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము

5.  అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను
    పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి

6.  లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి
    దావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా

7.  ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి
    నావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------