1762) నీ వాత్మ యుద్ధములో జయ మొందుము

** TELUGU LYRICS **

    నీ వాత్మ యుద్ధములో జయ మొందుము
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

1.  స్వామి యేసు తన సిలువను మోసి
    సైతాను రాజ్యము - పూర్తిగా జయించె
    నీవును యేసుని వెంబడి వెళ్ళుమా
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

2.  శిరమున ముండ్ల మకుటము ధరించి
    సిపాయిచే తలపై కొట్టబడె
    నీ శిరస్సు నట్లే సమర్పించు
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

3.  కల్వరి పైకి - ఒంటరిగానే
    వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
    నీవును ఆ దారినే వెళ్ళుమా
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

4.  లోకస్తులంతా - నిద్రించుచుండగా
    మోకాళ్ళపై యేసు - కొండపై నుండె
    నీవును ప్రార్థన శక్తి నొందుమా
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

5.  సాహసమున నీ - వాత్మ ఖడ్గమున
    సైతాను బంధము - ఖండించివేసి
    క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
    ఓ నా సోదరా వెనుకంజ వేయకు
    ఓ నా సోదరి వెనుకంజ వేయకు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------