1734) నీ మందిరమే మాకు ఆశ్రయం


** TELUGU LYRICS **

నీ మందిరమే మాకు ఆశ్రయం 
నీ సన్నిధియే మాకు ఆధారము 
నీ మాటలతో మమ్మునోదార్చుము 
నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము 
నీవే కదా ఆధారము - నీవే కదా ఆశ్రయం 
||నీ మందిరమే||

యాకోబును దీవించినట్టుగా - మమ్ము కూడా దీవించుమయా 
యోసేపుకు తోడైయున్నట్టుగా - మాకు కూడ తోడుండుమయా 
మోషేను నడిపించునట్లుగా - మమ్మును నడిపించుమయా 
దావీదును హెచ్చించినట్లుగా - మమ్మును హెచ్చించుమయా 
||నీ మందిరమే||

శిష్యులతో మాట్లాడినట్లుగా - మాతో కూడా మాట్లాడుమయా 
పేతురును క్షమియించినట్లుగా - మమ్ము కూడా క్షమియించుమయా
తోమాను సరిచేసినట్లుగా - మమ్మును సరిచేయుమయా 
పౌలును వాడుకొనినట్లుగా - మమ్మును వాడుకొమ్మయా 
||నీ మందిరమే||

-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)
-----------------------------------------------------------------------------