1733) నీ మందిరము నందు నివసించువారు ధన్యులు

** TELUGU LYRICS **

    నీ మందిరము నందు - నివసించువారు ధన్యులు, ధన్యులు
    నీ.. వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు (2)

1.  యెహోవా నీయందు - నమ్మికగలవారె ధన్యులు
    నీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు (2)

2.  నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులు
    ఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు

3.  హృదయశుద్ధి కనికరము - కలిగియున్నవారె ధన్యులు
    సాత్వీకులు సమాధానపరచు - వారె ధన్యులు

4.  క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులు
    మీ మీద చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు

5.  క్రీస్తు నిమిత్తం దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులు
    సంతోషించి స్తుతించినచో - పరలోకంలో ధన్యులు

6.  సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులు
    వ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు

7.  పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులు
    ప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు

8.  చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులు
    ప్రియ సోదర ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------