1732) నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికి

** TELUGU LYRICS **

    నీ మందిరము అతి శృంగారము - నీ ప్రజలందరికి
    మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ (2)

1.  నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి 
(2)
    స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి 
(2)
    కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి 
(2)
    మహిమ.. మహిమ.. మహిమ.. నీకె 
(2)

2.  నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము
    అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది
    అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము
    మహిమ.. మహిమ.. మహిమ.. నీకె నీకె

3.  నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం
    శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు
    అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము
    మహిమ.. మహిమ.. మహిమ.. నీకె

4.  కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన
    క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను
    మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ
    మహిమ.. మహిమ.. మహిమ.. నీకె

5.  అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి
    కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను
    యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక
    
మహిమ.. మహిమ.. మహిమ.. నీకె

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------