1440) నాదు ప్రాణమా నాదు ప్రాణమా

** TELUGU LYRICS **

    నాదు ప్రాణమా నాదు ప్రాణమా
    దేవుని క్రియల్మరువకుమా
    ఆయన చేసిన దేనిన్ మరువకుమా

1.  వ్యర్థుడనై నాశనంబౌ నిన్ను రక్షించి
    మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే
    ఓ నా మనసా యెంతటి ప్రేమా
    దేవుని క్రియల్మరువకుమా - నీ

2.  ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు
    ప్రయుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే
    సమర్పించు సర్వము తనకే
    దేవుని క్రియల్మరువకుమా - నీ

3.  రక్షణాలం కారవస్త్రము జీవాహారము
    శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే
    ప్రేమ పరిమళ స్తుతులను పాడి
    దేవుని క్రియల్మరువకుమా - నీ

4.  గెత్సేమనెలో కార్చె నేసు రక్త చెమటలను
    వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్
    వినుమా మనసా యేడ్చెను నీకై
    దేవుని క్రియల్మరువకుమా - నీ

5.  వచ్చెదననిన కాలమాయె తామసం బేల
    పభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడో
    ఆశతో ప్రభుని రాకడకోరి
    దేవుని క్రియల్మరువకుమా – నీ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------