1439) నాదు ప్రాణ మోప్రభో నేను నీకర్పింతును

** TELUGU LYRICS **

1.  నాదు ప్రాణ మోప్రభో
    నేను నీకర్పింతును.
    నాదు చేతు లెప్పుడు
    నీదు సేవఁ జేయనీ
    నాదు కాళ్లు లెస్సగా
    నీదు త్రోవఁ బోవనీ
    నాదు స్వర మెన్నఁడు
    నీదు స్తుతిఁ బాడనీ

2.  నాదు నోరు నిత్యము
    నీదు బోధఁ బల్క నీ
    నాదు సొమ్ము సొత్తులు
    నీకు నిత్తు నెప్పుడు
    నాదు కాల మంతయు
    నిన్నుఁ బ్రస్తుతింపనీ
    బుద్ధి పూర్వకంబు
    నిన్ను నేను కొల్వనీ.

3.  సొంత మేలుఁ గోరక
    నీదు కీర్తిఁ గోరుదు
    నాదు నంతరంగము
    స్వీకరించి యేలుము
    నాదు నిండు ప్రేమను
    నీకర్పింతు నెప్పుడు
    నన్ను నీదు సొత్తుగా
    నీ వంగీకరించుము.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------