1457) నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను

** TELUGU LYRICS **

    నా ప్రభు ప్రేమించెను (2) 
    నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
    నాకై తానే అర్పించుకొనెను (2)

1.  ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను
    యెహోవా సన్నిధిలో అర్పించెను (2) 
    మహాబలి గావించెను

2.  శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను
    దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను

3.  మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను
    దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను

4.  లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై
    కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను

5.  ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును
    నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------