2327) మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో

** TELUGU LYRICS **

    మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో
    కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో

1.  ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో
    ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి
    మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము

2.  జీవ జలనది - పారు నాసనమునుండి
    ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
    నెల నెల కాయును - పండ్రెండు కాపులను

3.  నూతన భువియందు - నూతన యెరూషలేముండు
    నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
    నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను

4.  తేజోమయునితో - మరి తేజోవాసులతో
    తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
    సజీవ జనకుని - సజీవ జనులమని

5.  చేరుదు మాపురము - పరమ పరదైసునకు
    కరువు మరణములు - కానము ఎన్నడును
    మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------