2388) మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక ఆఆ..

** TELUGU LYRICS **

    మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ.
    నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !

1.  బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
    జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2)
    నీ జ్ఞానమును - వివరింపతరమా (2)
    నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము

2.  వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా
    శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
    నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
    నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము

3.  అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
    నీ కసాద్యమైనది లేదే యెహోవా
    నీ సర్వశక్తిని - వివరింపతరమా
    నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు

4.  శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
    కొలువగలేము నీ - ఘనప్రేమను
    సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
    నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము

5.  ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
    మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
    అగపె ప్రేమను - వివరింప తరమా
    అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు

** ENGLISH LYRICS **

Mahima Ghanatha Sthuthi Prabhavamu - Neeke Kalugunu Gaaka Aa. Aa.
Neeke Kalugunu Gaaka Maa Devaa - Neeke Kalugunu Gaaka !

1. Buddhi Gnaana Sarva Sampadhalu - Nee Dhaanamule Gnaana Swaroopi (2)
Jagamunu Srushtinchi - Nirvahinchu Vaadavu (2)
Nee Gnaanamunu - Vivarimpatharamaa (2)
Nee Gnaanamutho Nimpu Mammu Maadhevaa - Nee Gnaanamutho Nimpu Mammu

2. Vendi Bangaaru Ashtaiswaryamulu - Nee Dhaanamule Shree Manthudaa
Shrestha Eevulanichchu - Jyothirmayudavu
Nee Mahimaiswaryam - Vivarimpatharamaa
Nee Mahimaiswaryamimmu Maa Devaa - Nee Mahimaiswaryamimmu

3. Adhika Balamu Sampoorna Shakthi - Nee Dhaanamule Yuddhashoorudaa
Nee Kasaadhyamainadhi Ledhe Yehova
Nee Sarvashakthini - Vivarimpatharamaa
Nee Sarvashakthitho Nimpu Maa Devaa - Nee Sarvashakthitho Nimpu

4. Shaashvathamainadhi Nee Madhura Prema - Gnaanamunaku Minchu Premaaswaroopi
Koluvagalemu Nee - Ghanapremanu
Saatileni Nee Preman Vivarimpatharamaa
Nee Prematho Nimpu Mammu Maa Devaa - Nee Prematho Nimpu Mammu

5. Arpagalemu Nee Prema Agninni - Agaadha Samudharamul Jwaalaamayudaa
Maranamantha Balamaina - Nee Prema Dhaatini
Agape Premanu - Vivarimpa Tharamaa
Agape Prematho Nimpu Maa Devaa - Agape Prematho Nimpu
-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------