** TELUGU LYRICS **
మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ
1. దేవదూతకును లేని దైవజనుని సేవ
దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ
దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ
2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ
పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ
పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ
3. ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ
ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ
ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ
4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ
బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ
బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ
5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ
సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ
సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ
6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ
లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ
లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------