2439) మాయ లోకము మోసపోకుము

** TELUGU LYRICS **  

    మాయ లోకము - మోసపోకుము
    యేసునందే రక్షణ దొరుకును నీకు

1.  బంధుమిత్రులు - భార్య బిడ్డలు - ధనము ఘనము అందచందము
    అవి అన్నియును - నీటిబుడగలె సమాధితోనే - సమాప్తమౌను

2.  పడగ విప్పిన - పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును
    పాప ఫలితము - మరణమేగదా దాని అంతము నిత్యనరకము

3.  నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి - ధరకువచ్చెను
    నీకు బదులుగా - శ్రమల నోర్చెను - సిలువలోనే బలియాయె నేసు

4.  ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు
    నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా

5.  దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును
    కార్చెను - నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగిలేచెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------