** TELUGU LYRICS **
మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా
కోపముతో నను జూడకుము - కనికరమున పలుకుము
కోపముతో నను జూడకుము - కనికరమున పలుకుము
1. నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు
సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు
నీ నోట దూషణమాట - ఒకటైనను రాలేదు
సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు
నీ నోట దూషణమాట - ఒకటైనను రాలేదు
2. పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి
సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి
ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను
సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి
ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను
3. సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి
మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన
నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి
మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన
నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి
4. జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను
నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి
నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి
నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి
నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి
5. రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు
నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు
దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ
నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు
దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------