2430) మానవ రూపమును ధరించి అరుదెంచె

** TELUGU LYRICS **

    మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు
    ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

1.  కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్
    శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్
    వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్
    ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

2.  చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై
    యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై
    యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా
    ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే

3.  సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను
    కన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా?
    నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా
    ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------