2435) మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత నింపి

** TELUGU LYRICS **

    మానసవీణను శృతిచేసి
    మనసు నిండా కృతజ్ఞత నింపి
    గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
    వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా

1.  వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
    సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
    స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం
    దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం

2.  శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి
    దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
    మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే
    స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------