** TELUGU LYRICS **
భరియించలేనయ్యా - నీ మౌనము
సహియించలేనయ్యా - ఈ భారము (2)
ఊహించలేదయ్యా - ఈ దూరము (2)
మన్నించు యేసయ్యా - నా పాపము (2)
||భరియించు||
నీ ప్రేమ కాదని నే వెళ్ళితి - నీతోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా - ఈ పాడు లోకముం
నమ్మకద్రోహమేగా - ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా - నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా - ఈ గాయము
||భరియించు||
నిరాశ నిస్పృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె - బలపరచు యేసయ్యా
నా తనువు చిద్రమాయె - కరుణించు యేసయ్యా
విడువని బంధమేగా - ఆ కలువరి యాగము
నను వీడి పోవనేగా - ఈ మౌనగీతము
||భరియించు||
------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా)
------------------------------------------------------------------------------------