** TELUGU LYRICS **
భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు
ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ
ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ
||భయమేల||
1. భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల
నుండియు విడిపించిప నీతితో మనుపలేడా
నుండియు విడిపించిప నీతితో మనుపలేడా
||భయమేల||
2. మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల
నూతన బలముతో గుఱికి నడిపించలేడా
2. మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల
నూతన బలముతో గుఱికి నడిపించలేడా
||భయమేల||
3. ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ
సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా
3. ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ
సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా
||భయమేల||
4. ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల
మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ
4. ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల
మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ
||భయమేల||
5. విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ
వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా
5. విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ
వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------