** TELUGU LYRICS **
బెత్లెహేములో ఒక చిన్న ఊరిలో
యేసురాజు పుట్టాడని
సర్వలోక పాపాలు మోసే
రక్షకుడు ఉదయించాడని
ఆ దూత గొల్లలకు
శుభవార్త చెప్పెనుగా
సంతోష సంబరాలు ప్రభుని చూడగా
పరలోక దూతలంత పరిశుద్ధ స్థలములో
సర్వాధికారినే స్తుతియించగా
ఇమ్మానుయేలుగా తోడుండగా
పరలోక రాజ్యం భూమినేలుగా
నిన్నే ప్రేమించి నీతోనే జీవించి
నిత్యుడవగు తండ్రిగా ఆధరించెరా
నీ స్నేహం కోరి తన మహిమను వీడి
సమాధాన కర్తగా దిగివచ్చెరా
నిత్యజీవాన్ని నీకీయగా
సత్య మార్గాన్ని చూపించగా
మన పాప భారాన్ని తొలగించెరా
పరలోకపు స్వాస్త్యాన్ని నీకిచ్చెరా
నీతిసూర్యుడు నీలోన ఉదయించి
నిజమైన వెలుగులో నడిపించెరా
కన్య మరియమ్మ గర్భాన జన్మించి
సర్వలోక పాపాన్ని పరిహరించెరా
ప్రేమ రాజ్యాన్ని స్తాపించగా
కరుణ కిరణాలు కురిపించెగా
నీ ఆత్మ దీపాన్ని వెలిగించెరా
నిత్యజీవపు మహిమగా నిన్ను మార్చెగా
యేసురాజు పుట్టాడని
సర్వలోక పాపాలు మోసే
రక్షకుడు ఉదయించాడని
ఆ దూత గొల్లలకు
శుభవార్త చెప్పెనుగా
సంతోష సంబరాలు ప్రభుని చూడగా
పరలోక దూతలంత పరిశుద్ధ స్థలములో
సర్వాధికారినే స్తుతియించగా
ఇమ్మానుయేలుగా తోడుండగా
పరలోక రాజ్యం భూమినేలుగా
నిన్నే ప్రేమించి నీతోనే జీవించి
నిత్యుడవగు తండ్రిగా ఆధరించెరా
నీ స్నేహం కోరి తన మహిమను వీడి
సమాధాన కర్తగా దిగివచ్చెరా
నిత్యజీవాన్ని నీకీయగా
సత్య మార్గాన్ని చూపించగా
మన పాప భారాన్ని తొలగించెరా
పరలోకపు స్వాస్త్యాన్ని నీకిచ్చెరా
నీతిసూర్యుడు నీలోన ఉదయించి
నిజమైన వెలుగులో నడిపించెరా
కన్య మరియమ్మ గర్భాన జన్మించి
సర్వలోక పాపాన్ని పరిహరించెరా
ప్రేమ రాజ్యాన్ని స్తాపించగా
కరుణ కిరణాలు కురిపించెగా
నీ ఆత్మ దీపాన్ని వెలిగించెరా
నిత్యజీవపు మహిమగా నిన్ను మార్చెగా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------