2278) బెత్లెహేములో క్రీస్తు రాజు పుట్టాడని

** TELUGU LYRICS **

బెత్లెహేములో  క్రీస్తు రాజు పుట్టాడని
మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త
సర్వోనతమైన స్థలములలో దేవునికే మహిమ 
స్తుతించుచు ఘనపరచూచు ఆరాధించెదము
స్తుతించుచు ఘనపరచూచు ఆర్భాటించెదము (2)

దీనుడై పసిబాలుడై దివీ నుండి భువికి వచ్చెను
మన పాపమంతా కడుగుటకై రక్షకునిగా పుట్టెను (2)
గొల్లలు జ్ఞానులు ఆయనను చూచి  సంబరపడిపోయిరి (2)
సాంబ్రాణియు భోలమును కానుకగా అర్పించిరి (2)

వీడరాని ఉన్నత భాగ్యం మనకొరకై విడిచెను 
సర్వప్రజల రక్షణ కొరకై దాసుని పోలిక ధరించెను (2)
సత్రంలో స్థలము లేనందున పశుల తొట్టెలో పరుండెను (2)
ఈ లోకానికి తండ్రీ ప్రేమను పంచెను క్రీస్తుని జననం (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------