2275) బెత్లెహేము పురములో ఒక వింత జరిగెను

** TELUGU LYRICS **

బెత్లెహేము పురములో ఒక వింత జరిగెను
పశులపాకలో రారాజు పుట్టెను
ఆ రాజు రాకతో ధన్యమాయే
భువి అంతా ఆ బాలుని జన్మతో
రక్షణయే మనకింకా
ఆనందం పొంగింది పరిశుద్ధుని రాకతో
పుడమంతా నిండింది క్రిస్మస్ కాంతులతో
క్రిస్మస్ కాంతులతో
గొప్ప పరిపాలకుడు జన్మించెను ఆనాడు
ఘనుడై మనచెంత చేరెను చూడు
ప్రేమకు ప్రశంసగా మనకై ఏతెంచగా
ఆరాధించెదం ఆనందముతో
గళమెత్తి పాడెదం సంతోషముతో
రారాజు ఆయనే రక్షకుడు ఆయనే
పూజింపరారండి జనులారా
ఆ ఆకాశమందు తారలన్ని ఏకముగా కూడి
పరలోక సైన్యమంతా హల్లెలూయ పాడి
వరముగా పంపగా ప్రియమైన పుత్రుని
ఆరాధించెదం ఆనందముతో
గళమెత్తి పాడెదం సంతోషముతో
రారాజు ఆయనే రక్షకుడు ఆయనే
పూజింపరారండి జనులారా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------