512) ఏలాటివాఁడో కాని యీ యేసుని

** TELUGU LYRICS **

    ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన
    యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను 
    ||ఏలాటి||

1.  ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను
    ఇంతలోనె పెద్దగాలి రేగెను
    ||ఏలాటి||

2.  అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె
    వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్
    ||ఏలాటి||

3.  చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో
    వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి
    ||ఏలాటి||

4.  దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను
    సమస్తము సద్దు ఉడిగిపోయెను
    ||ఏలాటి||

5.  ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు
    నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు
    ||ఏలాటి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments